• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

సూర్య గ్రహణాలు నాలుగు రకాలు

21 జూన్ 2020 ఆదివారం న అంతరిక్షంలో ఒక అద్భుతం ఆవిష్కరించబడుతుంది. 2020 సంవత్సరంలో మొట్టమొదటి సూర్యగ్రహణం ఈ రోజు ఏర్పడబోతోంది.  

హైదరాబాద్:  జూన్ 21 ఏర్పడబోయేది వలయాకార సూర్య గ్రహణం. చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతూ వుంటాడు. కొన్నిసార్లు చంద్రుడు భూమికి దూరంగా వెళ్ళి చిన్నదిగా కనిపిస్తాడు. దానినే అమోజీ స్థానం అంటారు. భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు అమోజీ స్థానంలో సాధారణ కాలంలో కంటే ఎక్కువ దూరంలో భూమి నుంచి ఉంటాడు కాబట్టి సూర్యబింబాన్ని మొత్తాన్ని కప్పెదంత సైజులో చంద్రుడు ఉండడు. తద్వారా సూర్యుడి యొక్క పరిధి బాగం కొంత కనిపిస్తుంది. అందువల్ల సూర్యబింబం అంగులీకార రూపంలో ఉంటుంది. అందువలనే దీనిని అంగులీకార (ఆన్యులార్)  సూర్యగ్రహణం అంటారు. లాటిన్ లో ఆన్యూలార్ అంటే ఉంగరం. ఈ అంగులీయక (వలయాకార) సూర్యగ్రహణం చూడటం ఓ అద్భుత దృశ్యం. మన దేశంలో ఈ గ్రహణం ఘర్యానా (రాజస్తాన్), సిర్సా(హర్యానా), డెహ్రాడూన్, టెహ్రా (ఉత్తరాంచల్), ... ప్రాంతాల్లో మాత్రం సంపూర్ణంగా కనిపిస్తుంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో పాక్షికంగా సూర్యగ్రహణం కనిపిస్తుంది. అంటే అంగులీయక సూర్యగ్రహణన్ని మనం చూడలేము.
  
మామూలు సమయంలోనైనా సూర్యుడిని నేరుగా చూస్తే చాలా ప్రమాదం అని మీకు తెలుసు కదా. రెటీనా దెబ్బతిని కనుచూపు పోయే ప్రమాదము ఉంది. సూర్యగ్రహణం సమయంలో కూడా అంతే. సూర్యుగ్రహణాన్ని కంటితో నేరుగా చూడడం ప్రమాదకరం.
 
ఎలాచూడాలి..?

1. శాస్త్రీయంగా తయారు చేసిన సోలార్ ఫిల్టర్స్ ద్వారా మాత్రమే గ్రహణాన్ని వీక్షించాలి. జనవిజ్ఞాన వేదిక ఈ సోలార్ ఫిల్టర్స్ ను ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది.

2. పిన్ హోల్ కెమెరా ద్వారా గ్రహణ ప్రతిబింబాన్ని చూడవచ్చు. 

3. Refractive telescope లేదా దర్పణం ద్వారా గ్రహణ ప్రతిబింబాన్ని  గోడ పై/ తెర పై చూడవచ్చు.

4. బాల్ - మిర్రర్ ద్వారా గ్రహణ ప్రతిబింబాన్నిగోడ పై/ తెర పై చూడవచ్చు

 

సూర్య గ్రహణాలు నాలుగు రకాలు అవి.. 

1. సంపూర్ణ (Total),
2.  అంగుళీయక (Anular),  
3. పాక్షిక (Partial), 
4. సంకర (Hybrid).

 

1. సంపూర్ణసూర్యగ్రహణం :- 
ఆకాశంలో సూర్యుడు చంద్రుడు ఒకే సైజులో కనపడే దూరంలో భూమి నుండి చంద్రుడు ఉన్నప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేయడం వల్ల ఇది జరుగుతుంది. అత్యంత ప్రకాశవంతమైన గోళం వలే కనిపించే సూర్యుడు చంద్రుడి ఛాయ వల్ల ఒక సన్నటి అంచువలే కనిపిస్తాడు. ఏదైన సమయంలో సంపూర్ణ సూర్య గ్రహణం భూమి మీద ఒక ప్రదేశములో వారికి మాత్రమే కనిపిస్తుంది.

 

2.అంగుళీయక (ఆన్యులర్) సూర్యగ్రహణం
సూర్యుడు చంద్రుడూ ఒకే కక్ష్య లోకి వస్తారు. కాని సూర్యుని కంటే చంద్రుని పరిమాణము చిన్నదిగా ఉండడం వలన, చంద్రుని చుట్టూ సూర్యుడు ఒక ప్రకాశవంతమైన ఒక ఉంగరం వలే కనిపిస్తాడు.

 

3.పాక్షిక సూర్యగ్రహణం 
సూర్యచంద్రులు ఒకే కక్ష్యలో ఉండరు. చంద్రుడు సూర్యుడిని పాక్షికంగానే అడ్డుకుంటాడు. అప్పుడు ఏర్పడే గ్రహణాన్ని పాక్షిక సూర్యగ్రహణం అని అంటారు. పాక్షిక గ్రహణం భూమి మీద చాలా భాగాలనుండి కనిపిస్తుంది.

 

4.సంకర గ్రహణం 
ఇది సంపూర్ణ, అంగుళీయక సూర్య గ్రహణాలకు మధ్యస్తంగా ఉంటుంది. ఈ సంకర గ్రహణము భూమిపై కొన్ని ప్రదేశాలలో సంపూర్ణ గ్రహణంగా, మరి కొన్ని ప్రదేశాలలో పాక్షికంగాను కనిపిస్తుంది. సంకర గ్రహాణాలు చాలా అరుదు. భూమి చుట్టూ ఉండే చంద్రుని కక్ష్య, సూర్యుడి చుట్టూ తిరిగే భూమి కక్ష్యా తలానికి 5 డిగ్రీల కంటే కొద్దిగా ఎక్కువ కోణంలో వంగి ఉంటుంది. దీని వలన అమావాస్య నాడు చంద్రుడు సూర్యుడికి పైనో  క్రిందో ఉంటాడు. అమావాస్య నాడు, చంద్రుడు చంద్ర కక్ష్య, భూకక్ష్య ఖండించుకునే బిందువులకు దగ్గరగా ఉన్నపుడు మాత్రమే సూర్య గ్రహణము ఏర్పడుతుంది. అందుకే అన్ని అమావాస్యలలో సూర్య గ్రహణం ఏర్పడదు. ఈ సారి అమావాస్య రోజు చంద్రుడు, సూర్యుడిని దక్షిణం నుండి ఉత్తరం వైపు దాటుతుంది.

 

గ్రహణాలు ఖగోళ శాస్త్రవేత్తలకు ఒక పండుగ!
సంపూర్ణ సూర్య గ్రహణాలు, భూమ్మీద ఎక్కడైనా సరే, చాలా అరుదు. సంపూర్ణ సూర్య గ్రహణం చూడదలచిన శాస్త్రజ్ఞులు ఆ గ్రహణం పట్టే ప్రదేశాలు సుదూరంలో ఉన్నప్పటికీ అక్కడకు వెళ్ళి ఆ గ్రహణాన్ని పరిశీలిస్తారు. ఖగోళ రహస్యాలను ఛేదించడానికి శాస్త్రవేత్తలకు యిది మహత్తర అవకాశం. అనేక పరిశీలనలు, పరిశోదనలు చేస్తారు. Einstein 'సాపేక్షత సిద్దాంతం' కు ఋజువులు దొరికింది సూర్యగ్రహణం సమయంలోనే (కాంతిపై గురుత్వాకర్షణ శక్తి ప్రభావం). 

 

రింగ్ ఆఫ్ ఫైర్:
అంగుల్యీకార సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు సూర్యుని చుట్టూ ఎర్రటి రింగు కనిపిస్తుంది.  ఆ ఎర్రటి రింగు పేరే కరోనా. అంటే ఇది సూర్యుని వాతావరణంలోని ఒక భాగం. ఈ కరోనా లేయర్ సోలార్ ఫిజిక్స్ లో అంతుచిక్కని రహస్యంగా ఉంది. ఎందుకంటే భగ భగ మండే సూర్యుడి కన్నా ఈ  కరోనా లేయర్ లో ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నట్టుగా శాస్త్రవేత్తల అంచనా. దీనిని కనిపెట్టడానికి నాసా వారు పార్కర్ ప్రోబ్ అనే ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని 2019 లో పంపింది. 2020 ఈ సంవత్సరం ఐరోపా, నాసా కలిపి సంయుక్తంగా మరొక కృత్రిమ ఉపగ్రహాన్ని పంపింది. మన ఇస్రో కూడా ఈ సంవత్సరం ఆదిత్య L-1 అనే కృత్రిమ ఉపగ్రహాన్ని పంపడానికి సిద్ధంగా ఉంది. ఈ కరోనా లేయర్ ను మనం  21 జూలై, 2020 అంగుల్యీకార సూర్యగ్రహణం రోజున చూడవచ్చు.

 

1999లో ఐరోపాలో కనిపించిన సూర్యగ్రహణమును ప్రపంచంలో అత్యధిక ప్రజలు వీక్షించారని చెబుతారు. దీనివలన గ్రహణాల పట్ల ప్రజలకు అవగాహన పెరిగింది. తరువాతి గ్రహణాలు 2005, 2006 లలోను, 2007 సెప్టెంబర్ 11 న వచ్చాయి. తరువాతి సంపూర్ణ సూర్యగ్రహణము 2008 ఆగష్టు 1 న, 2019 డిసెంబరు 16న వచ్చాయి


 

Related News

సూర్యగ్రహణం అనంతరం తెరుచుకున్న యాదాద్రి

సూర్యగ్రహణం అనంతరం తెరుచుకున్న యాదాద్రి

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు దాని అనుబంధ దేవాలయాల్లో ఈ రోజు భక్తులకు దర్శనం కల్పిస్తారు.  అనంతరం యథావిధిగా పూజలు నిర్వహించనున్నారు.
పిల్లలు గ్రహణం చూడొచ్చా..వద్దా..?

పిల్లలు గ్రహణం చూడొచ్చా..వద్దా..?

గ్రహణం పడుతున్న, వీడుతున్న సమయంలో సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు చాలా శక్తివంతంగా ఉంటాయి. ఇవి కంటి కేంద్ర భాగంలోని మాక్యులాకు నష్టం కలిగిస్తాయి. రెటినా మధ్యభాగంలో మాక్యులా ఉంటుంది. ఈ భాగం
ఈ రోజు, రేపు చంద్ర గ్రహణం

ఈ రోజు, రేపు చంద్ర గ్రహణం

ఈ రోజు, రేపు చంద్ర గ్రహణం - భారతదేశంలో కనిపించే సమయాలివీ...     భారత కాలమానం ప్రకారం జూన్ 5వ తేదీ రాత్రి 11.15 గంటలకు మొదలయ్యే చంద్రగ్రహణం జూన్ 6వ తేదీ ఉదయం 2.34 గంటలకు ముగుస్తుందని టైమ్ అండ్ డేట్ వెబ్‌సైట్ చెబుతోంది. అంటే ఈ చంద్రగ్రహణం పూర్తిగా 3 గంటల 18 నిమిషాల పాటు ఉంటుంది.