• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌లో మరో మార్పు

ప్రముఖ సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌లో మరో మార్పు చోటుచేసుకుంది. ఇప్పటి వరకు కేవలం వాట్సాప్‌గానే పేరున్న ఈ యాప్‌ ఇకపై ‘వాట్సాప్‌ బై ఫేస్‌బుక్‌’ అని యూజర్లకు కనిపించనుంది. ప్రస్తుతం బీటా (2.19.228) యూజర్లకు ఇది దర్శనమిస్తుండగా.. త్వరలో అందరికీ ఇదే పేరుతో కనిపించనుంది. అయితే, ఇది కేవలం పేరులో మార్పు తప్ప.. యాప్‌ లో అప్షన్స్ మాత్రం అన్ని సేమ్ గానే ఉంటాయి. ఇతర మార్పూలూ చోటుచేసుకోకపోవడం గమనార్హం. 2012లో ఇన్‌స్టాను, 2014లో వాట్సాప్‌ను ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసినప్పటికీ అవి ఆయా పేర్లతోనే ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. అయితే దీని పేరును ఇటీవలే మార్చాలని ఫేస్‌బుక్‌ నిర్ణయించింది. ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌ బై ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ బై ఫేస్‌బుక్‌ అని మారుస్తున్నట్లు పేర్కొంది. అందుకనుగుణంగానే వాట్సాప్‌లో తాజా మార్పు చోటుచేసుకుంది. బీటా యూజర్లు వాట్సాప్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళితే..‘వాట్సాప్‌ బై ఫేస్‌బుక్‌’ అని కనిపిస్తుంది. 
 

Related News