• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన సానియా

హైదరాబాద్ :  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్  ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు ఫిలింనగర్ లోని తన కార్యాలయం ఆవరణంలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మొక్కలు నాటారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారని దీనివల్ల మనం ప్రకృతిని రక్షించుకోవడం జరుగుతుందని.  ఈ చాలెంజ్ లో మొక్కలు నాటడం నాకు ఎంతో సంతృప్తినిచ్చిందని  మీర్జా తెలిపారు. నీను మరొక ముగ్గురికి ఛాలెంజ్ ఇస్తున్నాను అని 1) అజారుద్దీన్ భారత దేశం మాజీ క్రికెట్ కెప్టెన్ 2) జయేష్ రంజన్ (IAS) ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి 3) సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి లను మొక్కలు నాటాలని  సానియా వీరికి  పిలుపునిచ్చింది.