• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

శభాష్ పోలీస్

హైదరాబాద్‌: నాంపల్లి రైల్వేస్టేషన్‌లో ఘోర ప్రమాదం తప్పింది. కదులుతున్న చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ నుంచి కిందకు దిగేందుకు ఓ ప్రయాణికుడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో సదరు ప్రయాణికుడు రైలు - ప్లాట్‌ఫాం మధ్య జారి చిక్కుకున్నాడు. ఈ విషయాన్ని అక్కడ డ్యూటిలోవున్న రైల్వే కానిస్టేబుల్‌ వికుల్‌ కుమార్‌ గమనించి, సాహసంతో ఆ ప్రయాణికుడిని కాపాడాడు. కదిలే రైలు వెంట పరుగెత్తి మరీ ప్రయాణికుడిని కాపాడారు వికుల్‌. ప్రమాదంలో ఉన్న ప్రయాణికుడిని సాహసంతో కాపాడిన వికుల్‌ కుమార్‌ను ఆర్పీఎఫ్‌ ఐజీ ఈశ్వర్‌, కమిషనర్‌ రామకృష్ణ అభినందించారు. 
 

Related News