• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

రాయల్‌ బెంగాల్ టైగ‌ర్ కిర‌ణ్ మృతి

హైద‌రాబాద్‌: ‌జ‌వ‌హ‌ర్‌ల్ నెహ్రూ జువాల‌జిక‌ల్ పార్కులో తెల్ల‌రంగు రాయల్‌ బెంగాల్ టైగ‌ర్ కిర‌ణ్ మృతి చెందింది. ఎనిమిదేండ్ల కిర‌ణ్ కుడి దవడ భాగంలో ఏర్పడిన నియోప్లాస్టిక్‌ కణితి కార‌ణంగా అనారోగ్యం పాలైంద‌ని, గ‌త కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ ఇప్పుడు మ‌ర‌ణించింద‌ని జూ అధికారులు తెలిపారు. కిర‌ణ్ నెహ్రూ జూలోనే పుట్టి పెరిగింద‌ని వారు వెల్ల‌డించారు. గ‌త నెల 29న ప‌రీక్ష‌లు చేయ‌గా కిర‌ణ్ కుడి ద‌వ‌డ‌లో క‌ణితి ఉన్న విష‌యం బ‌య‌ట‌ప‌డింద‌ని చెప్పారు. అప్ప‌టి నుంచి శాస్త్ర‌వేత్త‌‌లు, వైద్యులు పులికి చికిత్స అందిస్తున్నార‌ని తెలిపారు. మృతి చెందిన పులికి వెటర్నరీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వ‌హించారు. కిరణ్‌ తండ్రి బద్రి కూడా నియో ప్లాస్టిక్‌ కణితితోనే బాధపడుతూ కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. కిర‌ణ్‌ తాత రుద్ర 12 ఏండ్ల‌ వయసులో ఇదే వ్యాధితో మృతి చెందింది. ఇప్పుడు కిరణ్‌ కూడా అదే వ్యాధితో మృతి చెందడంతో వైద్యులు శాంపిళ్లు సేకరించి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. కాగా, జూపార్కుకే వన్నెతెచ్చే రాయల్‌ బెంగాల్‌ టైగర్లు ఒకేర‌క‌మైన‌ ట్యూమర్‌ వ్యాధితో మృతి చెందుతుండటం ఆందోళనకు గురి చేస్తోంద‌ని అధికారులు పేర్కొన్నారు. 

Related News

జూపార్క్ వెబ్ సైట్ ను ఆవిష్క‌రించిన ఇంద్ర‌క‌ర‌ణ్

జూపార్క్ వెబ్ సైట్ ను ఆవిష్క‌రించిన ఇంద్ర‌క‌ర‌ణ్

నెహ్రూ జూలాజిక‌ల్ పార్క్  వెబ్ సైట్, నెహ్రూ జూ పార్క్ (Nehru Zoo Park) మొబైల్ అప్ ను అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆవిష్కరించారు.  నెహ్రూ జూలాజిక‌ల్ పార్క్ కు సంబంధించిన స‌మ‌గ్ర స‌మాచారాన్ని ఇందులో పొందుప‌రిచార‌ని, జంతు ప్రేమికులు కూడా జంతువుల దత్తత వివ‌రాలను ఈ వెబ్ సైట్ (www.nehruzoopark.in) ద్వారా తెలుసుకోవ‌చ్చ‌ని మంత్రి తెలిపారు. సంద‌ర్శ‌కులు ఆన్ లైన్
ఆకతాయిల చేస్టలకు గర్భంతో ఉన్న ఏనుగు మృతి!  

ఆకతాయిల చేస్టలకు గర్భంతో ఉన్న ఏనుగు మృతి!  

కేరళ మలప్పురం దగ్గర్లోని ఓ గ్రామంలో కొందరు ఆకతాయిలు అత్యంత క్రూరమైన చర్యకు పాల్పడ్డారు. మానవత్వం మరిచిపోయి గర్భంతో ఉన్న ఓ ఏనుగు చావుకు కారణమయ్యారు. ఆకలితో ఉన్న ఓ జంతువుకు ఆహారం ఆశచూపి.. దాని ప్రాణాలు తీశారు. మాన వత్వాన్ని మంటగల్పిన ఈ ఘటన గత నెలలో కేరళలో చోటు చేసుకొంది.