• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

విక్రమ్ ఫోన్ లో ఏముంది..?

 
మాజీ మంత్రి ముఖేశ్ కుమార్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ కాల్పుల ఘటనకు - డ్రగ్స్కు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.
 
హైదరాబాద్‌ :  డ్రగ్స్ కేసుకు భయపడి విక్రమ్ గౌడ్  ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విక్రమ్ ఫోన్ లో డ్రగ్స్ సమాచారం ఉంది. వాట్సప్ మెసేజ్ ల్లో డబ్బుల కోసం డిమాండ్లు చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో తన పేరు బయటికి వస్తుందని విక్రమ్ లో భయంతో ఆత్మహత్యాయత్నం చేసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విక్రమ్ గౌడ్ మొబైల్ లో 39 వాట్సప్ మెసేజ్ లుంటే అన్నింట్లోనూ డబ్బులు ఇవ్వాలని బాధితులు మెసేజ్ లు పంపినట్లు తెలుస్తోంది. రూ.15లక్షలు - రూ.20లక్షలు - రూ.35లక్షలు ఇవ్వాలని వాట్సప్ మెసేజ్ లో బాధితులు అడిగినట్లు తెలుస్తోంది.
ఇదిలాఉండగా...నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి అపోలో ఆస్పత్రికి వద్ద మీడియాతో మాట్లాడుతూ పలు వివరాలు వెల్లడించారు. `` విక్రమ్ గౌడ్ ఆలయానికి వెళ్లడానికి సిద్ధమవుతుండగా కాల్పులు జరిగాయి. కాల్పుల శబ్దంతో పై అంతస్తు నుంచి విక్రమ్ భార్య కిందకు వచ్చింది. రక్తపు మడుగులో ఉన్న విక్రమ్ ను ఆస్పత్రికి తరలించింది. విక్రమ్ గౌడ్ పై రెండు రౌండ్ల కాల్పులు జరిగాయి. విక్రమ్ గౌడ్ ఇంట్లో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నాం. కేసు దర్యాప్తు కోసం 10 బృందాలు ఏర్పాటు చేశాం. కేసు విచారణ వేగవంతం చేశాం. విక్రమ్ గౌడ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది` అని సీపీ వివరించారు.
 
కాగా తెల్లవారుజామున 3:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. అర్థరాత్రి 12:30 గంటల తర్వాత విక్రమ్ గౌడ్ ఇంటికొచ్చాడు. పూజలో పాల్గొనెందుకు ఉదయం నిద్రలేచాడు. ఇదే సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు కాల్పులు జరిపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాత్రి ఇంటికొచ్చేటప్పుడు ఎవరితోనో విక్రమ్ ఘర్షణ పడ్డట్లు తెలిసింది. వాళ్లే వచ్చి విక్రమ్ గౌడ్ పై కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు. విక్రమ్ గౌడ్ నివాసంలో లైసన్స్ లేని తుపాకిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనకు తానే కాల్చుకున్నాడా లేక ఎవరైనా కాల్పులు చేసారా అన్న విషయం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు అపోలో ఆస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.                    
 

Related News