• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

ఎల్బీ స్టేడియంలో పోలీస్ ఎగ్జిబిషన్

హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన ఎక్స్‌పోను రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఇవాల హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రారంభించారు. మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత కల్పించిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. పోలీసుల సంస్మరణ దినం నేపథ్యంలో ఎక్స్‌పోను ఏర్పాటు చేశారు. పోలీసు శాఖ చేపట్టిన వివిధ పథకాల గురించి మంత్రి వివరించారు. షీ టీమ్స్ కాన్సెప్ట్ చాలా సక్సెస్ అయినట్లు మంత్రి నాయిని గుర్తు చేశారు. రాష్ట్రంలో శాంతి, భద్రతల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. పోలీస్ ఎగ్జిబిషన్ సందర్భంగా.. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ, సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు.

Related News