• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

ఖేల్‌ర‌త్న కోసం అంజుమ్ మౌద్గిల్ పేరు

న్యూఢిల్లీ: ప‌్ర‌తిష్టాత్మ‌క క్రీడా పుర‌స్కారం ఖేల్‌ర‌త్న కోసం షూట‌ర్ అంజుమ్ మౌద్గిల్ పేరును నేష‌న‌ల్ రైఫిల్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) నామినేట్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఆమెతో పాటు కోచ్ జ‌స్పాల్ రాణాను ద్రోణాచార్య అవార్డు కోసం ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటు మ‌రో ఇద్ద‌రు యువ షూట‌ర్ల పేర్ల‌ను అర్జున అవార్డుల కోసం పంపించ‌నున్న‌ట్లు ఓ అధికారి తెలిపారు. కొంత కాలంగా షూటింగ్‌లో నిల‌క‌డ‌గా రాణిస్తున్న అంజుమ్‌.. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన విష‌యం తెలిసిందే. విశ్వ‌క్రీడ‌ల్లో ప‌త‌కం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న మౌద్గిల్‌కు ఖేల్‌ర‌త్నా పొందే అన్ని అర్హ‌త‌లు ఉన్న‌ట్లు ఆయ‌న అన్నారు. పిస్ట‌ల్ షూట‌ర్ సౌర‌భ్ చౌద‌రి, అభిషేక్ వ‌ర్మ పేర్ల‌ను అర్జున అవార్డుకు నామినేట్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. జ‌స్పీల్ రాణాకు ద్రోణాచార్య అవార్డు ద‌క్క‌క‌పోవ‌డంపై ఒలింపిక్ గోల్డ్ మెడ‌ల్ విన్న‌ర్ అభిన‌వ్ బింద్రా గ‌తంలో విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. 
 

Related News

అర్జున అవార్డుకు‌ జస్ప్రీత్‌ బుమ్రా

అర్జున అవార్డుకు‌ జస్ప్రీత్‌ బుమ్రా

ఈ ఏడాది ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం అర్జున అవార్డుకు భారత టీమ్‌ ఏస్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా పేరును బీసీసీఐ ప్రతిపాదించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన