• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

ముజ్రా పార్టీ పై పోలీసులు దాడి

హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్‌ పార్టీ పేరుతో పబ్‌ బుక్‌ చేసుకొని కొంతమంది యువతీ యువకులు ముజ్రా పార్టీ చేసుకున్నారు. మందు కొడుతూ యువతులు నృత్యాలు చేస్తుంటే డబ్బులు విసురుతూ జల్సా చేసుకున్నారు ఆ యువకులు. ఈ సమాచారం అందుకున్న పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి నిర్వహించి 12 మంది యువకులను, ఆరుగురు యువతులను ఒక హిజ్రాను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దర్ని ముంబైకు చెందిన డ్యాన్సర్లుగా గుర్తించారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు – 2 హైడ్రోజన్‌ పబ్‌లో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పబ్‌పై దాడి చేసిన పోలీసులు లోపల జరుగుతున్న పార్టీని చూసి ఆశ్చర్యపోయారు. ఆ పబ్ లో మద్యం సీసాలు పట్టుకొని యువకులు యువతులతో నృత్యాలు చేస్తున్నారు. పబ్‌ నిర్వాహకుడు ప్రదీప్‌, నసీర్‌ ఈ పార్టీ ఏర్పాటు చేసినట్టు విచారణలో తేలింది. పాతబస్తీకి చెందిన ముస్తాక్‌, అబ్దుల్‌ రహ్మన్‌, ఫిర్దో్‌సఖాన్‌, వీసం, మొహీన్‌, అహ్మద్‌, సలాం, అహ్మద్‌ బిన్‌ అమర్‌ లతో పాటు ముక్తార్‌ఖాన్‌, అల్ఫానాఖాన్‌, నూర్‌ఖాన్‌ లను, ఆరుగురు యువతులను అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్‌ పోలీసులకు అప్పగించారు. పబ్‌ నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. మేనేజర్‌ పద్మనాభంను అరెస్టు చేశారు.

Related News