• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

వరంగల్ లో వలస కూలీల అనుమానస్పద మృతి

వరంగల్: వలస కూలీల అనుమానస్పద మృతితో వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రె కుంటలో విషాదం చొటుచేసుకుంది. గొర్రెకుంటలోని కోల్డ్ స్టోరేజ్ కు ఎదురుగా ఉన్న బావిలో పడి నలుగురు వలస కూలీలు మృత్యువాతపడ్డారు.  వీరిలో ఓ చిన్నారి కూడా ఉంది.  ఈ సంఘటన స్థానికులను ఎంతగానో కలిచి వేసింది. పశ్చిమ బెంగాల్, బీహార్ కు చెందిన వలస కూలీలు బతుకు దెరువు కోసం వరంగల్ శివారు ప్రాంతంలోని గొర్రెకుంట గ్రామానికి వచ్చి, నివాసం ఉంటున్నారు.  స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. లాక్ డౌన్ లో రాష్ట్ర ప్రభుత్వ సడలింపుల్లో భాగంగా వలస కూలీలు సొంత ఊర్లకు వెళ్తున్న క్రమంలో పశ్చిమ బెంగాల్ నుంచి వలస వచ్చి సుప్రియ కోల్డ్ స్టోరేజీలో పనిచేస్తున్న వీరు స్థానికంగా వున్న బావిలో పడి మృత్యువాత పడటం పలు అనుమానాలకు దారి తీస్తుంది. ఈ సమాచారం తెలుసుకోని సంఘటనా స్థలానికి చేరుకున్న గీసీకొండ పోలీసులు క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను బావిలో నుంచి తీసి వరంగల్ ఎంజీఎంకు తరలించారు.  అయితే బాధితులతో పాటు నివాసముండే బీహార్ కు చెందిన వలస కూలీలను పోలీసులు ఈ ఘటనపై విచారిస్తున్నారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
 

Related News

తెలంగాణ నుంచి క‌దిలే రైళ్ల వివరాలు

తెలంగాణ నుంచి క‌దిలే రైళ్ల వివరాలు

వచ్చే నెల 1 నుంచి పట్టాలెక్కనున్న 200 ప్యాసింజర్‌ రైళ్లకు ఇవాళ‌ ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్‌ ప్రారంభమంకానున్న‌ది. టికెట్లు  ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా మాత్రమే బుక్‌ చేసుకోవాలి అని రైల్వే శాఖ తెలిపింది. రైల్వే స్టేష‌న్లలో కౌంటర్లు బంద్
ఇంద్రకీలాద్రి అమ్మ‌వారి ద‌ర్శ‌నంకు  గ్రీన్ సిగ్నల్

ఇంద్రకీలాద్రి అమ్మ‌వారి ద‌ర్శ‌నంకు గ్రీన్ సిగ్నల్

ఇంద్రకీలాద్రి అమ్మ‌వారి ద‌ర్శ‌నం కోసం దేవాలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అంయితే  టిక్కెట్లను ఆన్‌లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. మొబైల్ ఫోన్ ద్వారా టైమ్ స్లాట్ నిర్దార‌ణ చేసుకోవడానికి మార్గదర్శకాలు జారీ అయ్యాయి
వలసకూలీలపై మరోసారి లాఠీ విరిగింది

వలసకూలీలపై మరోసారి లాఠీ విరిగింది

వలసకూలీలపై మరోసారి లాఠీ విరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో శనివారం ఉదయం పోలీసులు లాఠీఛార్జి చేయడంతో కూలీలు భయంతో పరుగులు తీశారు.వివరాల్లోకి వెళితే... ఈనెల 15వ తేదీ సాయంత్రం రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న కూలీలను అటుగా వెళ్తున్న
ఏపీలో త్వరలో సినిమాలు,రెస్టారెంట్లు ప్రారంభం

ఏపీలో త్వరలో సినిమాలు,రెస్టారెంట్లు ప్రారంభం

గత 52 రోజులుగా..దేశం మొత్తంగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, విద్యా సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు అన్నీ బంద్ అయిపోయాయి..అయితే గత కొద్ది రోజుల ముందే కేంద్రం కొన్ని మినహాయింపులతో
వరంగల్ పోలీసుల నుంచి తప్పించుకోలేరమ్మా..

వరంగల్ పోలీసుల నుంచి తప్పించుకోలేరమ్మా..

కరోనా వైరస్ కారాణంగా దేశవ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే  లాక్ డౌన్ ఉండడంతో చాలా మంది ఇంటికే పరిమితమవుతున్నారు. మరి కొందరు కుటుంబ సభ్యులతో కాలాన్ని గడుపుతున్నారు. ఉద్యోగులు వర్క్ ఫ్రం ‎హోం చేస్తున్నారు. ఇది ఇలా వుంటే కొందరు యువత మాత్రం
నేడు కువైట్‌ నుంచి తొలి విమానం

నేడు కువైట్‌ నుంచి తొలి విమానం

విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులతో కువైట్‌ నుంచి తొలి విమానం హైదరాబాద్‌కు రానుంది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి తొలిదశలో 64 విమానాలను కేంద్ర ప్రభుత్వం
వలస కూలీల తరలింపునకు కేంద్రం పచ్చజెండా

వలస కూలీల తరలింపునకు కేంద్రం పచ్చజెండా

లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని పలుచోట్ల చిక్కుకుపోయిన కూలీలు, విద్యార్థులు, యాత్రికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర  హోంశాఖ రాష్ట్రాలను ఆదేశించింది.