• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

ఇండియాలో మరోసారి సంపూర్ణ లాక్ డౌన్

మరోసారి లాక్ డౌన్ ఖాయమే... రైల్వేస్ నుంచి సంకేతాలు వచ్చాయంటున్న నిపుణులు!


న్యూఢిల్లీ : ఇండియాలో మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ విధించే అవకాశం ఉందంటున్నారు పలువురు. ఈ నెలాఖరు వరకూ మాత్రమే రైళ్లను నడుపుతామని, ఆపై జూలై 1 నుంచి ఆగస్టు 12 వరకూ సాధారణ రైళ్లను నడపబోమని రైల్వే శాఖ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. 43 రోజుల పాటు ఇప్పటికే బుక్ చేసుకున్న టికెట్లన్నీ క్యాన్సిల్ అయినట్టేనని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ముందస్తు బుకింగ్స్ చేసుకున్న వారి డబ్బులను వారి ఖాతాల్లోకే జమ చేస్తామని కూడా ప్రకటించింది. ఇక ఈ ప్రకటనతో మరోసారి లాక్ డౌన్ ఖాయమన్న విశ్లేషణ తెరపైకి వచ్చింది. ప్రయాణాలు చేయాలని భావించిన వారు ఈ ఐదు రోజుల్లోనే గమ్యాలకు చేరుకోవాలని, ఆ తరువాత మరో విడత లాక్ డౌన్ అమలులోకి వస్తుందని పలువురు అంటున్నారు. ఈ విషయంలో సోషల్ మీడియాలో సైతం జూలై 1 నుంచి మరో లాక్ డౌన్ అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటం, దేశంలోని ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్య కరోనా పేషంట్లతో నిండిపోవడం, కొత్త కేసులు వస్తే చికిత్స చేసేందుకు వైద్యులు చేతులెత్తేయాల్సిన పరిస్థితి పలు మెట్రో నగరాల్లో నెలకొని వుండటంతో, లాక్ డౌన్ అమలుతోనే పరిస్థితి చక్కబడుతుందని ఇటీవల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన సమావేశంలో అభిప్రాయాలు వెలువడ్డాయి. మరో నెలన్నర పాటు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తే, ఆసుపత్రుల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు రికవరీ అవుతారని, ఆ సమయానికి కేసులు తగ్గడంతో పాటు, వైరస్ ను నిరోధించే డ్రగ్స్ సైతం విరివిగా మార్కెట్లోకి వస్తాయన్న ఆలోచనతో ఉన్న కేంద్రం, అప్పుడు ఒకేసారిగా లాక్ డౌన్ ను ఎత్తివేసి, ఆర్థిక వృద్ధి తిరిగి పుంజుకునేలా అన్ని విధాల వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలకు అనుమతి ఇచ్చేలా, ఓ పటిష్ఠ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలో త్వరలోనే స్పష్టత వస్తుంది.

Related News

3వ దశ లాక్‌డౌన్‌ నిబంధనలు మీకు తెలుసా?

3వ దశ లాక్‌డౌన్‌ నిబంధనలు మీకు తెలుసా?

లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని పలుచోట్ల చిక్కుకుపోయిన కూలీలు, విద్యార్థులు, యాత్రికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను ఆదేశించింది. మరోపక్క 3వ దశ లాక్‌డౌన్‌ నిబంధనలు
5న తెలంగాణ కేబినెట్‌ కీలక భేటీ

5న తెలంగాణ కేబినెట్‌ కీలక భేటీ

కరోనా వ్యాప్తి నివారణ, లాక్‌డౌన్‌ పరిస్థితులపై చర్చించేందుకు ఈ నెల 5న తెలంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో
లాక్ డౌన్ లో చిక్కుకున్నవారికి గుడ్ న్యూస్

లాక్ డౌన్ లో చిక్కుకున్నవారికి గుడ్ న్యూస్

లాక్ డౌన్ కారణంగా వరంగల్ అర్బన్ జిల్లాలో ఇరికిపోయిన వారు తమ స్వంత ప్రాంతాలకు వెళ్ళేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో  టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేశారు
లాక్‌డౌన్‌ లో కేంద్రం గ్రీన్ సిగ్నల్

లాక్‌డౌన్‌ లో కేంద్రం గ్రీన్ సిగ్నల్

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా వేర్వేరు చోట్ల చిక్కుకుపోయిన వారికి ఊరట లభించింది. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, కూలీలు, విద్యార్థులు, పర్యాటకులను
ఎల్లుండి నుంచి లారీలు బంద్‌‌!

ఎల్లుండి నుంచి లారీలు బంద్‌‌!

రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసరాలు, ధాన్యం, ఇతర సరుకులు రవాణా చేస్తున్న లారీలు, డీసీఎంలను బంద్​ చేయాలని వాటి ఓనర్లు యోచిస్తున్నారు. లాక్​డౌన్​ కారణంగా బండ్లు రోడ్డెక్కడమే లేదని, అందువల్ల క్వార్టర్లీ ట్యాక్స్​ ఎట్లా కట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
మే 4 నుంచి లాక్‌డౌన్ ల్లో మార్పులు : కేంద్రం

మే 4 నుంచి లాక్‌డౌన్ ల్లో మార్పులు : కేంద్రం

వచ్చే నెల 4 నుంచి దేశంలో పలుప్రాంతాల్లో లాక్‌డౌన్ నిబంధనలు సడలించే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరికొన్ని రోజుల్లో ఈ విషయంలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని
అప్పుడే పుట్టిన..బిడ్డ పేరు లాక్‌డౌన్

అప్పుడే పుట్టిన..బిడ్డ పేరు లాక్‌డౌన్

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌న‌తో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ది. దీంతో జ‌నం ఇండ్ల‌కే ప‌రిమితమ‌వడంతోపాటు వ‌ల‌స కూలీలు, వివిధ ప‌నులు కోసం ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లిన‌వాళ్లు ఎక్కిడికక్క‌డే చిక్కుకుపోయారు