• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

త్వరలో లాక్‌డౌన్‌ పై నిర్ణయం చేప్తాం : కేసీఆర్ 

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించాలన్న ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకొంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించుకొంటే, అనేక అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ విధిస్తే కట్టుదిట్టంగా, సంపూర్ణంగా అమలుచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నిత్యావసర సరుకులు కొనుగోళ్లుచేయడానికి వీలుగా ఒకటి రెండు గంటలు మాత్రమే సడలింపు ఇచ్చి, రోజంతా కర్ఫ్యూ విధించాల్సి ఉంటుందని తెలిపారు. విమానాల రాకపోకల్ని ఆపాల్సి ఉంటుందని, ప్రభుత్వ పరంగా అన్ని సిద్ధంచేయాల్సి ఉంటుందన్నారు. అన్ని విషయాలను లోతుగా పరిశీలించిన తరువాత మూడు నాలుగు రోజుల్లో సరైన వ్యూహాన్ని ఖరారుచేస్తామని వెల్లడించారు. కరోనా వైరస్‌వ్యాప్తి నివారణ, వైరస్‌ సోకినవారికి అందుతున్న చికిత్స, భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు, ఆర్ అండ్ బి శాఖ మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, దాని నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్ సమావేశంలో పరిస్థితిని సీఎం కు వివరించారు.

Related News

3వ దశ లాక్‌డౌన్‌ నిబంధనలు మీకు తెలుసా?

3వ దశ లాక్‌డౌన్‌ నిబంధనలు మీకు తెలుసా?

లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని పలుచోట్ల చిక్కుకుపోయిన కూలీలు, విద్యార్థులు, యాత్రికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను ఆదేశించింది. మరోపక్క 3వ దశ లాక్‌డౌన్‌ నిబంధనలు
5న తెలంగాణ కేబినెట్‌ కీలక భేటీ

5న తెలంగాణ కేబినెట్‌ కీలక భేటీ

కరోనా వ్యాప్తి నివారణ, లాక్‌డౌన్‌ పరిస్థితులపై చర్చించేందుకు ఈ నెల 5న తెలంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో
లాక్ డౌన్ లో చిక్కుకున్నవారికి గుడ్ న్యూస్

లాక్ డౌన్ లో చిక్కుకున్నవారికి గుడ్ న్యూస్

లాక్ డౌన్ కారణంగా వరంగల్ అర్బన్ జిల్లాలో ఇరికిపోయిన వారు తమ స్వంత ప్రాంతాలకు వెళ్ళేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో  టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేశారు
లాక్‌డౌన్‌ లో కేంద్రం గ్రీన్ సిగ్నల్

లాక్‌డౌన్‌ లో కేంద్రం గ్రీన్ సిగ్నల్

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా వేర్వేరు చోట్ల చిక్కుకుపోయిన వారికి ఊరట లభించింది. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, కూలీలు, విద్యార్థులు, పర్యాటకులను
ఎల్లుండి నుంచి లారీలు బంద్‌‌!

ఎల్లుండి నుంచి లారీలు బంద్‌‌!

రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసరాలు, ధాన్యం, ఇతర సరుకులు రవాణా చేస్తున్న లారీలు, డీసీఎంలను బంద్​ చేయాలని వాటి ఓనర్లు యోచిస్తున్నారు. లాక్​డౌన్​ కారణంగా బండ్లు రోడ్డెక్కడమే లేదని, అందువల్ల క్వార్టర్లీ ట్యాక్స్​ ఎట్లా కట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
మే 4 నుంచి లాక్‌డౌన్ ల్లో మార్పులు : కేంద్రం

మే 4 నుంచి లాక్‌డౌన్ ల్లో మార్పులు : కేంద్రం

వచ్చే నెల 4 నుంచి దేశంలో పలుప్రాంతాల్లో లాక్‌డౌన్ నిబంధనలు సడలించే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరికొన్ని రోజుల్లో ఈ విషయంలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని
అప్పుడే పుట్టిన..బిడ్డ పేరు లాక్‌డౌన్

అప్పుడే పుట్టిన..బిడ్డ పేరు లాక్‌డౌన్

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌న‌తో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ది. దీంతో జ‌నం ఇండ్ల‌కే ప‌రిమితమ‌వడంతోపాటు వ‌ల‌స కూలీలు, వివిధ ప‌నులు కోసం ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లిన‌వాళ్లు ఎక్కిడికక్క‌డే చిక్కుకుపోయారు