• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

కన్వీనర్ కోటాలో ఎంబిబిఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల 


ఈ నెల25, 26వ తేదీలలో వెబ్ కౌన్సెలింగ్ 


 

వరంగల్ :  ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాలో  ఎంబిబిఎస్‌  వైద్య విద్య కోర్సులో ప్రవేశాలకు  తుది విడత కౌన్సెలింగ్ (mop up round) కు  కాళోజి వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.  రాష్ట్రవ్యాప్తంగా  వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోట కింద సీట్ల భర్తీకి ఇప్పటికే మొదటి , రెండు, మూడో విడత వెబ్ కౌన్సిలింగ్‌ పూర్తి అయింది. కన్వీనర్ కోటలో ఇంకా మిగిలిపోయిన ఖాళీలను ఈ మాప్ అప్ రౌండ్ ద్వారా భర్తీ చేయనున్నారు. కళాశాల వారిగా ఖాళీలను వెబ్ సైట్ లో పొందుపరిచారు. మొదటి ర్యాంక్ నుండి చివరి ర్యాంక్ వరకు అభ్యర్థులందురు  ఈనెల 25వ తేదీ సాయింత్రం 6గంటల నుండి 26వ తేదీ సాయింత్రం 5 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. పూర్తి  వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ www.knruhs. in , www.knruhs.telangana.gov.in లో చూడవచ్చని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు. 
 

Related News