• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

గ్రామీణ భారతం: 50% కుటుంబాలకు అర్ధాకలి

దిల్లీ: లాక్‌డౌన్‌ అమలుతో గ్రామీణ భారతంలో 50% కుటుంబాలు ఆహార పదార్థాలను తీసుకోవడం తగ్గించాయని పౌర సమాజ సంస్థల అధ్యయనం ఒకటి పేర్కొంది. ఆహార కొరత భయంతో రెండు పూటలే భోజనం చేశారని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 47 జిల్లాల్లో 5000 కుటుంబాలతో ప్రదాన్‌, బీఏఐఎఫ్‌, ట్రాన్స్‌ఫామ్‌ రూరల్‌ ఇండియా, గ్రామీణ్‌ సహారా, సాతి యూపీ, వికాస్‌ అన్వేష్‌ ఫౌండేషన్‌ సంస్థలు ఉమ్మడిగా సర్వే చేశాయి. లాక్‌డౌన్‌ అమలు చేసిన వెంటనే ఆహార భద్రత కోసం 50% కుటుంబాలు భోజనాలను తగ్గించుకున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. 68% మంది భోజనాల్లో ఆహార పదార్థాల సంఖ్యను తగ్గించుకున్నారని వెల్లడించింది. ప్రజా సరఫరా వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా 84% కుటుంబాలు తిండిగింజలు స్వీకరించగా 37 శాతం ఇంటివద్దనే రేషన్‌ అందుకున్నారు. 24% కుటుంబాలు గ్రామాల నుంచి ధాన్యం తెచ్చుకున్నాయి. 12% మంది ఉచితంగా పొందారు. ఓ వెబినార్‌ ద్వారా ఈ అధ్యయనం వివరాలను వెల్లడించారు. ‘ఎక్కువ మంది ప్రజలు ప్రజా పంపిణీ వ్యవస్థపైనే ఆధారపడ్డారు. లాక్‌డౌన్‌ షాకులో తక్కువ పదార్థాలు, తక్కువ ఆహారం తీసుకుంటున్నారు. పీడీఎస్‌ వ్యవస్థ ద్వారా వీరికి ఎక్కువ తిండిగింజలు అందించాలి. లాక్‌డౌన్‌ వదంతులతో పాడి, కోళ్ల పరిశ్రమ దెబ్బతింది. నగదు లేకపోవడంతో ప్రజలు అప్పులు చేస్తున్నారు’ అని ఆ సంఘాల ప్రతినిధులు తెలిపారు.


 

Related News

3వ దశ లాక్‌డౌన్‌ నిబంధనలు మీకు తెలుసా?

3వ దశ లాక్‌డౌన్‌ నిబంధనలు మీకు తెలుసా?

లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని పలుచోట్ల చిక్కుకుపోయిన కూలీలు, విద్యార్థులు, యాత్రికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను ఆదేశించింది. మరోపక్క 3వ దశ లాక్‌డౌన్‌ నిబంధనలు
5న తెలంగాణ కేబినెట్‌ కీలక భేటీ

5న తెలంగాణ కేబినెట్‌ కీలక భేటీ

కరోనా వ్యాప్తి నివారణ, లాక్‌డౌన్‌ పరిస్థితులపై చర్చించేందుకు ఈ నెల 5న తెలంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో
లాక్ డౌన్ లో చిక్కుకున్నవారికి గుడ్ న్యూస్

లాక్ డౌన్ లో చిక్కుకున్నవారికి గుడ్ న్యూస్

లాక్ డౌన్ కారణంగా వరంగల్ అర్బన్ జిల్లాలో ఇరికిపోయిన వారు తమ స్వంత ప్రాంతాలకు వెళ్ళేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో  టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేశారు
లాక్‌డౌన్‌ లో కేంద్రం గ్రీన్ సిగ్నల్

లాక్‌డౌన్‌ లో కేంద్రం గ్రీన్ సిగ్నల్

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా వేర్వేరు చోట్ల చిక్కుకుపోయిన వారికి ఊరట లభించింది. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, కూలీలు, విద్యార్థులు, పర్యాటకులను
ఎల్లుండి నుంచి లారీలు బంద్‌‌!

ఎల్లుండి నుంచి లారీలు బంద్‌‌!

రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసరాలు, ధాన్యం, ఇతర సరుకులు రవాణా చేస్తున్న లారీలు, డీసీఎంలను బంద్​ చేయాలని వాటి ఓనర్లు యోచిస్తున్నారు. లాక్​డౌన్​ కారణంగా బండ్లు రోడ్డెక్కడమే లేదని, అందువల్ల క్వార్టర్లీ ట్యాక్స్​ ఎట్లా కట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
మే 4 నుంచి లాక్‌డౌన్ ల్లో మార్పులు : కేంద్రం

మే 4 నుంచి లాక్‌డౌన్ ల్లో మార్పులు : కేంద్రం

వచ్చే నెల 4 నుంచి దేశంలో పలుప్రాంతాల్లో లాక్‌డౌన్ నిబంధనలు సడలించే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరికొన్ని రోజుల్లో ఈ విషయంలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని
అప్పుడే పుట్టిన..బిడ్డ పేరు లాక్‌డౌన్

అప్పుడే పుట్టిన..బిడ్డ పేరు లాక్‌డౌన్

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌న‌తో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ది. దీంతో జ‌నం ఇండ్ల‌కే ప‌రిమితమ‌వడంతోపాటు వ‌ల‌స కూలీలు, వివిధ ప‌నులు కోసం ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లిన‌వాళ్లు ఎక్కిడికక్క‌డే చిక్కుకుపోయారు