• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

రాష్ట్రంలో మండుతున్న ఎండలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఎండలకు జనాలు జంకుతున్నారు. రాష్ట్రంలో అధికంగా వడగాల్పుల తీవ్రత ఉంది. వృద్ధులు, పిల్లలు బయటకు రావొద్దని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాగల రెండు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట వరకు నమోదైన ఉష్ణోగ్రతలను ప్రకటించారు.  జగిత్యాలలో 47. 2 డిగ్రీల ఉష్ణోగ్రత, పెద్దపల్లిలో 47.0, మంచిర్యాలలో 46.9, నల్లగొండలో 46.8, పెద్దపల్లిలో 46.7, భద్రాద్రి కొత్తగూడెంలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. బేగంపేట ఎయిర్‌పోర్టు పరిసరాల్లో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత, రాజేంద్రనగర్‌లో 42.5, హయత్‌నగర్‌లో 41.8, హకీంపేటలో 42.8, ఇక్రిశాట్‌ పటాన్‌చెరులో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. నిన్నటి ఉష్ణోగ్రతలతో పోల్చితే ఇవాళ అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అధిక ఉక్కపోత వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇవాళ పలు జిల్లాల్లో అక్కడక్కడ తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. నేడు, రేపు ఆదిలాబాద్‌, కుమ్రంభీం, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

Related News

రేపు, ఎల్లుండి అందరు జర జాగ్రత్త

రేపు, ఎల్లుండి అందరు జర జాగ్రత్త

ఒకపక్క కరోనా వైరస్ వ్యాపిస్తుంటే మరో పక్కన సూర్యుడు తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. నేటి నుంచి 24 వరకు 2 తెలుగు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు పెరగనుండడంతో తెలంగాణ, ఏపీ ప్రజలు రేపటి నుంచి జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. రేపటి నుంచి ఈ నెల