• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

హోంమంత్రి మ‌హ‌మూద్ అలీకి క‌రోనా పాజిటివ్‌ 

హైద‌రాబాద్‌:  తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మ‌హ‌మూద్ అలీకి క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. కోవిడ్‌19 ప‌రీక్ష‌లో ఆయ‌న పాజిటివ్‌గా తేలారు. జూబ్లీ హిల్స్‌లోని అపోలో హాస్పిట‌ల్‌లో హోంమంత్రి మ‌హ‌బూద్ అలీ అడ్మిట్ అయ్యారు. గ‌త బుధ‌వారం.. ఆయ‌న వ‌ద్ద ఉన్న అయిదుగురు గ‌న్‌మెన్లు..క‌రోనా ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలారు. ప్ర‌స్తుతం మ‌హ‌మూద్ అలీ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ది. హాస్పిట‌ల్ సిబ్బంది ఆయ‌న్ను అనునిత్యం ప‌రీక్షిస్తున్నారు. అస్తమా ఉండటంతో ముందుగానే కుటుంసభ్యులు ఆదివారం సాయంత్రం హాస్పిట‌ల్‌లో చేరిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. పోలీసులు హోంమంత్రితో తిరిగిన వారిని క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. అలాగే హోంమంత్రి నివాసం ఉండే పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది శానిటైజర్ చేస్తున్నారు. తెలంగాణలో కరోనా వైరస్‌ వల్ల ఇప్పటికే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌ కోవిడ్‌ బారిన పడగా, తాజాగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ కూడా ఈ జాబితాలో చేరారు. రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజే 983 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 14,419కి చేరింది.

Related News