• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

వాట్సప్ యూజర్లకు శుభవార్త

వాట్సప్ యూజర్లకు శుభవార్త. త్వరలో మీ వాట్సప్ అకౌంట్‌ను నాలుగు డివైజ్‌లలో వాడుకోవచ్చు. ప్రస్తుతం ఈ సదుపాయం లేదు. స్మార్ట్‌ఫోన్‌తో పాటు డెస్క్‌టాప్‌లో మాత్రమే వాట్సప్ ఉపయోగించుకోవచ్చు. కానీ త్వరలో మల్టీపుల్ డివైజ్‌లలో వాట్సప్ ఉపయోగించుకునేలా సరికొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. వాట్సప్‌కు సంబంధించిన సమాచారాన్ని ప్రపంచానికి తెలిపే WABetaInfo ప్రకారం త్వరలోనే ఈ ఫీచర్ రిలీజ్ కానుంది. ఈ అప్‌డేట్ వచ్చిన తర్వాత ఒకే అకౌంట్‌ని నాలుగు డివైజ్‌లలో ఒకేసారి వాడుకోవచ్చు. ఎక్కువ డివైజ్‌లు ఉపయోగించేవారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. కొందరి చేతుల్లో మనం రెండు స్మార్ట్‌ఫోన్స్ చూస్తుంటాం. రెండు ఫోన్లలో ఒకే వాట్సప్ అకౌంట్‌ వాడుకోవచ్చు. అంతేకాదు.. ట్యాబ్లెట్ వాడుతున్నా అదే అకౌంట్‌ని ట్యాబ్‌లో లాగిన్ చేయొచ్చు. ఇలా వేర్వేరు డివైజ్‌లలోని డేటా వైఫై కనెక్టివిటీ ద్వారా సింక్ అవుతుంది.

 

గతేడాది నుంచి వాట్సప్ యూజర్లను ఊరిస్తున్న ఫీచర్ ఇది. ఐఓఎస్ బీటా వర్షన్‌లో కనిపించింది. అప్పట్నుంచీ ఈ ఫీచర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వాట్సప్ యూజర్లు ఎదురుచూస్తున్నారు. ఇక వాట్సప్ తేదీతో సెర్చ్ చేసే ఫీచర్‌ని కూడా పరీక్షిస్తోంది. ఈ ఫీచర్ వస్తే మీరు ఏ తేదీకి సంబంధించిన ఛాటింగ్ వివరాలు చూడాలనుకుంటే ఆ డేట్ సెలెక్ట్ చేస్తే చాలు. ఆ రోజు మెసేజెస్ మాత్రమే కనిపిస్తాయి.


 

Related News

అతి త్వరలో వాట్సాప్​లో సరికొత్త ఫీచర్స్

అతి త్వరలో వాట్సాప్​లో సరికొత్త ఫీచర్స్

ఎప్పటినుంచో వేచి చూస్తున్న సరికొత్త ఫీచర్స్ వాట్సాప్​లో అతి త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ మేరకు కంపెనీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. యానిమేటెడ్​ స్టిక్కర్స్, క్యూఆర్​ కోడ్స్, వెబ్​ వాట్సాప్​కు డార్క్ మోడ్​, క్వాలిటీ
భారత్ లో టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై నిషేధం

భారత్ లో టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై నిషేధం

చైనాకు భారత ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశ రక్షణ, భద్రతను దృష్టి పెట్టుకొని టిక్‌టాక్‌ సహా షేరిట్‌, యూసీ బ్రౌజర్‌, బైడు మ్యాప్‌, ఎంఐ కమ్యూనిటీ, క్లబ్‌ ఫ్యాక్టరీ తదితర 59 యాప్‌లను బ్యాన్‌ చేసింది.
గూగుల్‌ పే యాప్‌ను ఆర్‌బీఐ బ్యాన్‌ చేసిందా..?

గూగుల్‌ పే యాప్‌ను ఆర్‌బీఐ బ్యాన్‌ చేసిందా..?

భారత్‌లో గూగుల్‌ పే యాప్‌ను ఆర్‌బీఐ బ్యాన్‌ చేసిందంటూ సోషల్‌ మీడియాలో షికార్లు చేస్తున్న పుకార్లపై నేషనల్‌ పేమెంట్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) క్లారిటీ ఇచ్చింది. దీనిపై ఎన్‌పీసీఐ శుక్రవారం స్పందిస్తూ.. గూగుల్‌ పే యాప్‌ను ఇండియాలో బ్యాన్
ఓ యువకుని ప్రాణం తీసిన వాట్సాప్‌ స్టేటస్‌

ఓ యువకుని ప్రాణం తీసిన వాట్సాప్‌ స్టేటస్‌

వాట్సాప్‌ స్టేటస్‌ ఓ యువకుని ప్రాణం తీసింది. మహారాష్ట్రలోని పూణే జిల్లా వడ్గాన్‌ మావల్‌ ప్రాంతంలో శుక్రవారం 22 ఏళ్ళ యువకుని హత్య కలకలం రేపింది. యశ్‌ అవాలే అనే ఈ యువకుడు శుక్రవారం రాత్రి తాక్వే గ్రామంలోని తన నివాసానికి సమీపంలో వాకింగ్‌ చేస్తుండగా బైక్‌లపై వచ్చిన ఏడుగురు
వాట్స‌ప్-యూజ‌ర్ల‌కు శుభ‌వార్త‌

వాట్స‌ప్-యూజ‌ర్ల‌కు శుభ‌వార్త‌

వాట్సాప్ స‌రికొత్త ఫీచ‌ర్లు, ఆప్ష‌న్ల‌తో వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకోడానికి వాట్స‌ప్ కార్య‌చ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ సిద్ధం చేస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా 180 దేశాల్లో వాట్స‌ప్ వ్యవస్థకు 1.5 బిలియ‌న్ యూజ‌ర్లు ఉండ‌గా, మ‌న దేశంలో 400 మిలియ‌న్‌ల యూజ‌ర్లు ఉన్నారు.