• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

అర్జున అవార్డుకు‌ జస్ప్రీత్‌ బుమ్రా

ఢిల్లీ: ఈ ఏడాది ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం అర్జున అవార్డుకు భారత టీమ్‌ ఏస్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా పేరును బీసీసీఐ ప్రతిపాదించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ అధికారి బుధవారం వెల్లడించారు. 2019లోనూ అర్జున అవార్డుకు బుమ్రా పేరును కేంద్ర క్రీడాశాఖకు నామినేట్‌ చేసినా సీనియర్‌ అయిన రవీంద్ర జడేజాకు పురస్కారం దక్కిందని చెప్పారు. ఈసారి అర్జున అవార్డు పొందేందుకు కావాల్సిన అన్ని అర్హతలు బుమ్రాకు ఉన్నాయని, అతడే ప్రాధాన పోటీదారుడిగా ఉండనున్నాడని చెప్పారు. ‘అతడికి అత్యుత్తమ అర్హతలు ఉన్నాయి. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ దేశాల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన ఏకైక ఆసియా బౌలర్‌గా బుమ్రా ఉన్నాడు’ అని ఆ అధికారి వెల్లడించారు. అలాగే టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ పేరును కూడా అర్జున అవార్డు కోసం నామినేట్‌ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపాడు. 

Related News