• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

తెలంగాణలో కొత్తగా 52 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్: ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 52 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1813 కు చేరింది. కొత్తగా వచ్చిన కరోనా పాజిటివ్‌ కేసుల్లో 33 జీహెచ్‌ఎమ్‌సీలోనే నమోదయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో 19 నమోదయ్యాయి.  ఈ రోజు కరోనా పాజిటివ్‌ వచ్చి చికిత్స తీసుకుని తిరిగి కరోనా నెగెటివ్‌ వచ్చి డిశ్చార్జ్‌ అయిన వారు 25 మంది ఉన్నారు. దీంతో మొత్తం రాష్ట్రంలో ఉన్న యాక్టివ్‌ కేసుల సంఖ్య 696 గా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నయం అయి డిశ్చార్జ్‌ అయి ఇంటికి వెళ్ళిన వారి సంఖ్య 1068 మందిగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య మొత్తం 49 మంది. మొత్తం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 137. 

Related News