• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

తెలంగాణలో ఇవాళ 945 కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. ఇవాళ మరో 945 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతి చెందారు. మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 869 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 16,339 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 260 మంది మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 29, సంగారెడ్డి జిల్లాలో 21 కరోనా కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ జిల్లాలో 13 కరోనా కేసులు, నిర్మల్ జిల్లాలో 4 కేసులు, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో కొత్తగా 2 కరోనా కేసులు, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం, వికారాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కోటి చొప్పున కేసులు నమోదయ్యాయి.