• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

చైనాలో క్రీడలు ప్రారంభం

చైనాలోని వుహాన్ కేంద్రంగా ప్ర‌పంచానికి వ్యాపించిన‌ క‌రోనా అన్ని రంగాల‌ను కోలుకోలేని దెబ్బ‌తీస్తోంది. ముఖ్యంగా క్రీడారంగానికి సంబంధించి అన్ని టోర్నీలు వాయిదా ప‌డ‌టం లేదా ర‌ద్దుచేయ‌బ‌డ్డాయి. అయితే చైనాలో క‌రోనా శాంతించ‌డంతో ఇప్పుడిప్పుడే అక్క‌డ సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. ఈ నేప‌థ్యంలోనే చైనాలో క్రీడ‌లు సైతం ప్రారంభానికి సిద్ద‌మ‌వుతున్నాయి. చైనీస్ సూపర్ లీగ్ (సిఎస్ఎల్) కొత్త సీజన్‌ను జూన్ చివరలో లేదా జూలై ఆరంభంలో ప్రారంభించబోతున్నట్లు అక్క‌డి ప్ర‌తినిధులు తెలిపారు. సిఎస్ఎల్ మొదట ఫిబ్రవరి 22 న ప్రారంభం కావాల్సి ఉండ‌గా..కరోనా మహమ్మారి కారణంగా ఈ లీగ్ వాయిదా పడ్డింది.

Related News