• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

చేపమందు ప్రసాదంకు కరోనా షాక్


హైదరాబాద్‌: ప్రతీ యేడు మృగశిర కార్తెలో  ఆస్తమా పేషంట్లకు దొరికే చేపమందు ప్రసాదం ఈ యేడు రద్దైనట్లే. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా మృగశిర కార్తె లో వేసే చేప ప్రసాదం ను నిలిపివేస్తున్నట్లు బత్తిని సోదరులు ప్రకటించారు. కరోన వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో ఈ సారి చేప ప్రసాదం పంపిణీని నిలిపి వేస్తున్నట్లు వారు తెలిపారు. అయితే చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తామని ఎవరైనా చెబితే నమ్మకూడదని, ఈ కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో చేపమందు ప్రసాదం స్వీకరించడం సరైంది కాదని బత్తిని సోదరులు ప్రజలకు సూచించారు.  చేపప్రసాదం కోసం దేశవ్యాప్తంగా ప్రజలు హాజరవుతారు కనుక కార్తె కు 20 రోజుల ముందే చేప ప్రసాదం పంపిణీ చేయడం లేదనే విషయాన్ని వారు వెల్లడించారు. ఆస్తమా రోగులెవరు తమ వద్దకు రాకూడదని బత్తిని సోదరులు విజ్ఞప్తి చేసారు.
 

Related News