• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

సౌరవ్‌ గంగూలీకు మద్దతిస్తాం :‌ గ్రేమ్‌స్మిత్‌


ఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తే బాగుంటుందని దక్షిణాఫ్రికా క్రికెట్‌ (సీఎస్‌ఏ) డైరెక్టర్‌ గ్రేమ్‌స్మిత్‌ అన్నాడు. ఆటగాడిగా అనుభవం ఉన్న దాదా ప్రపంచ క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్తాడని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. సీఎస్‌ఏ సీఈవో జాక్వెస్‌ ఫాల్‌ సైతం ఈ ప్రతిపాదనకు మద్దతు ప్రకటించాడు. ప్రస్తుత ఛైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ పదవీ కాలం ఈ నెలతో ముగియనుంది. కరోనా వైరస్‌ పరిస్థితుల్లో ఆయనకు మరో రెండు నెలల పొడగింపు లభిస్తుందని భావిస్తున్నారు. గంగూలీకి మద్దతుగా స్మిత్‌ మాట్లాడటంతో పరిణామాలు ఒక్కసారిగా ఉత్కంఠకరంగా మారాయి. ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు మాజీ ఛైర్మన్‌ కొలిన్‌ గ్రేవ్స్‌ ఇప్పటివరకు ఆశావహుల జాబితాలో ముందున్నారు. కొత్త రాజ్యాంగ ప్రకారం దాదా పదవీకాలం సైతం త్వరలోనే ముగియనుంది. ‘ఐసీసీ అత్యున్నత పదవిలో గంగూలీ లాంటి క్రికెట్‌ ఆటగాడు ఉంటే బాగుంటుంది. అతడు ఎంపికవ్వడం ఆటకు మంచిది. ఆధునిక క్రికెట్‌పై దాదాకు అవగాహన ఉంది. అతడు అత్యున్నత స్థాయిలో ఆడాడు. ప్రస్తుత సవాళ్లు అతడికి బాగా అర్థమవుతాయి. అందరూ అతడిని గౌరవిస్తారు. ముందుకెళ్లేందుకు అతడి నాయకత్వం కీలకమవుతుంది. క్రికెట్‌ సరైన స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. అతడు ఎంపికైతే మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది’ అని స్మిత్‌ అన్నాడు.

Related News