• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

జులైలో టీమ్‌ఇండియా శ్రీలంక పర్యటన

న్యూఢిల్లీ: వచ్చే జులైలో శ్రీలంకలో టీమ్‌ఇండియా పర్యటన ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్- జులై‌లో శ్రీలంక పర్యటనలో కోహ్లీసేన అక్కడ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేలా ఇప్పటికే షెడ్యూల్ ఖరారైందని తెలిపింది. కాగా  కరోనా వైరస్‌ కారణంగా లంక టూర్‌పై సందిగ్ధత నెలకొంది. జూలైలో భారత పర్యటనను రద్దు చేయవద్దని శ్రీలంక బోర్డు  బీసీసీఐని అభ్యర్థించింది. దీనిపై బీసీసీఐ కోశాధికారి అరున్‌ దుమాల్‌ స్పందించారు. 'లాక్‌డౌన్‌ సడలింపులు, ప్రయాణ ఆంక్షల ఎత్తివేత తదితర అంశాల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై  టీమ్‌ఇండియా పర్యటన  ఆధారపడి ఉంటుంది. ఆటగాళ్ల భద్రత, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మా నిర్ణయం ఉంటుంది. అన్ని సక్రమంగా ఉంటే లంకలో పర్యటించేందుకు సిద్ధంగానే ఉన్నామని' దుమాల్‌ పేర్కొన్నారు. శ్రీలంకలో కరోనా ప్రభావం తక్కువగానే ఉందని అన్నారు. 

Related News