• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

హోం క్వారంటైన్ కు కోచ్ పుల్లెల గోపీచంద్

సూర్యాపేట జిల్లా : ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ను హోం క్వారంటైన్ కు తరలించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న గోపీచంద్ కు తెలంగాణ వైద్య ఆరోగ్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని రామాపురం చెక్ పోస్ట్ వద్ద ఆయనకు వైద్య  పరీక్షలు నిర్వహించిన వైద్యసిబ్బంది గోపీచంద్ కు హోం క్వారంటైన్ ముద్ర వేశారు.  అత్యవసరంగా హైదరాబాద్ వస్తుండగా  తనకు వైద్యపరీక్షలు నిర్వహించారని గోపీచంద్ తెలిపారు. అయితే లాక్ డౌన్ సడలింపులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణకు వచ్చే వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే పుల్లెల గోపిచంద్ కు కరోనా పరీక్షలు నిర్వహించారు.

 

Related News