• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

మాస్క్ పెట్టుకోమన్నందుకు ఉద్యోగిపై దాడి

నెల్లూరు జిల్లా : మాస్క్ పెట్టుకోమన్నందుకు మహిళ ఉద్యోగిపై ఓ అధికారి దాడి చేసిన సంఘటన నెల్లూరులోని ఏపీ టూరిజం ఆఫీస్ లో చోటు చేసుకుంది. అక్కడ డిప్యూటీ మేనేజ‌ర్‌గా విధులు నిర్వహిస్తున్న భాస్కర్‌రావు ముఖానికి మాస్క్ లేకుండా కార్యాలయానికి వచ్చాడు. దీంతో అదే కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగిని ఉషారాణి ముఖానికి

మాస్క్ పెట్టుకోమని సూచించింది. దీంతో ఆగ్రహానికి గురైన భాస్కర్‌రావు దివ్యాంగురాలైన ఉషారాణిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. మహిళ అని కూడా చూడకుండా ఇనుపరాడ్డుతో కొట్టాడు. పలువురు ఉద్యోగులు అడ్డుకున్నప్పటికీ.. అతను శాంతించలేదు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి భాస్కర్ రావును రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై ఏపీ టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పందించారు. బాధితురాలితో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఆ రోజు కార్యాలయంలో ఏం జరిగిందో పూర్తి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ సైతం అధికారును ఆదేశించారు.

 

Related News

ఈ బాబు మాస్క్ ‘బంగారం’

ఈ బాబు మాస్క్ ‘బంగారం’

కరోనాతోనూ కామెడీలు చేస్తున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ పై వచ్చిన జోకులు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు భయం..మరో వైపు కామెడీ. ఇప్పటికే దేశంలో రకరకాల మాస్క్ లు వచ్చాయి. కరోనా నుంచి రక్షణగా వీటిని వాడుతున్నారు. ప్రభుత్వాలు కూడా మాస్క్ లు
మార్కెట్లోకి త్రిపాఠీ మాస్కులు వస్తున్నాయి

మార్కెట్లోకి త్రిపాఠీ మాస్కులు వస్తున్నాయి

కరోనా (కొవిడ్ 19) కాలంలో 'ఇంట్లో తయారు చేసిన మాస్క్‌లు' ధరించడం ఆరోగ్యానికి ఎంతో అవసరం. హైదరాబాద్‌కు చెందిన డిజైనర్ అనితా రెడ్డి సహకారంతో ఈ ఏడాది మార్చి నుంచి స్టార్ హీరోయిన్ లావణ్యా త్రిపాఠీ మాస్క్‌లు తయారు చేయిస్తున్నారు.
మాస్కుల్లో ఎన్‌95 మాస్క్ ప్రత్యేకత తెలుసా..?

మాస్కుల్లో ఎన్‌95 మాస్క్ ప్రత్యేకత తెలుసా..?

కరోనా నేపధ్యంలో మనం వాడతున్న సాదారణ మాస్కులు రెండు, మూడు రోజులకు మించి ఉపయోగించలేము. అంతే కాకుండా అవి అంత ఖచ్చితంగా కరోనాను అడ్డుకుంటాయి అని ఖచ్చితంగా  కూడా చెప్పలేము. కానీ కరోనాను కట్టడి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా