• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

నేడు మోదీ పశ్చిమబెంగాల్‌, ఒడిశాలో పర్యటన

న్యూఢిల్లీ:  ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం పశ్చిమబెంగాల్‌, ఒడిశా రాష్ట్రాలను పర్యటించనున్నారు. అంఫాన్‌ తుఫాన్‌ ప్రభావంతో ఆ రెండు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితి ప్రధాని పరిశీలించనున్నారు. ముందుగా పశ్చిమబెంగాల్‌కు చేరుకుని అక్కడి నుంచి హెలిక్యాప్టర్‌లో ఏరియల్‌ సర్వే నిర్వహిస్తారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న రక్షణ, పునరావాస చర్యలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు. ఆ తర్వాత ఒడిశాలో సైతం ప్రధాని ఏరియల్‌ సర్వే చేసి, సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర తుఫాన్‌గా మారి ఒడిశా, బెంగాల్‌ తీర ప్రాంతాల నడుమ తీరాన్ని తాకింది. దీంతో ఆ రెండు రాష్ట్రాల్లో బలమైన ఈదురు గాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. పలుచోట్ల చెట్లు నేలకూలాయి. పంటలు ధ్వంసమయ్యాయి. పలు తీర ప్రాంత గ్రామాల్లో నివాసాలు దెబ్బతిన్నాయి. అయితే ఒడిశాతో పోల్చితే పశ్చిమబెంగాల్‌పై తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా పడింది. అంఫాన్‌ తుఫాన్‌ ఆ రాష్ట్రంలో 72 మందిని పొట్టనపెట్టుకుంది.

Related News

అతి తీవ్ర తుఫాన్‌గా మారిన అంఫ‌న్

అతి తీవ్ర తుఫాన్‌గా మారిన అంఫ‌న్

అతి తీవ్ర తుఫాన్‌గా మారిన అంఫ‌న్ ఇవాళ ఒడిశాలోని పార‌దీప్ దీవులను దాటింది. ప్ర‌స్తుతం ఆ తుఫాన్ బాల‌సోర్ వ‌ద్ద కేంద్రీకృత‌మై ఉన్న‌ద‌ని, మ‌రో మూడు గంట‌ల్లో అది తీరాన్ని పూర్తిగా దాటేస్తుంద‌ని, దీంతో ఆ ప్రాంతంలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు
తెలంగాణలో నేడు రేపు వర్షాలు

తెలంగాణలో నేడు రేపు వర్షాలు

తెలంగాణలో నేడు రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని సూచించింది. దీంతో పంట నూర్పిడి చేసిన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని