• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

గండిపేట గుట్టల్లో అమెరికన్ మృతదేహం!

హైదరాబాద్:  సైక్లింగ్ చేస్తున్న ఓ అమెరికా యువకుడు గండిపేట గుట్టల్లో విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, యూఎస్ కు చెందిన రాబర్ట్ పాల్ (38) ఆయన భార్య అంజలీనాతో కలిసి గచ్చిబౌలి ప్రాంతంలో నివాసం ఉంటూ, ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. వ్యాయామం నిమిత్తం సైకిల్ తీసుకుని వెళ్లిన అతను, తిరిగి ఇంటికి చేరకపోగా, భార్య పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, అతని మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ను ట్రేస్ చేయగా, అవి ఖానాపూర్ దగ్గరలోని గండిపేట రిజర్వాయర్ ప్రాంతంలో ఆగిపోయాయి. దీంతో ఆ ప్రాంతానికి పోలీసులు వెళ్లగా, పాల్ మృతదేహం రోడ్డుపై కనిపించింది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.

Related News