• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

వారికి సకాలంలో వేతనాలు చెల్లించాల్సిందే..!

వారికి సకాలంలో వేతనాలు చెల్లించాల్సిందే..! ఇంజినీరింగ్‌ కాలేజీలకు ఏఐసీటీఈ ఆదేశాలు.

దిల్లీ: కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ సమయంలోనూ బోధన, బోధనేతర సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించాలని అన్ని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలు, సాంకేతిక సంస్థల్ని ‘అఖిల భారత సాంకేతిక విద్యా మండలి’(ఏఐసీటీఈ) ఆదేశించింది. ఫిబ్రవరి, మార్చి నెలలకు కూడా వేతనాలు చెల్లించలేదని ఫిర్యాదులు వెల్లువెత్తిన వేళ ఏఐసీటీఈ స్పందించి ఈ ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సంక్షోభం కొనసాగుతున్న వేళ యాజమాన్యాల వేతనాల కోత నిర్ణయం వల్ల అనేక కుటుంబాలు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి తలెత్తుతోందని ఏఐసీటీఈ ఛైర్మన్‌ అనిల్‌ సహస్రబుద్ధే కాలేజీలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సకాలంలో అందరికీ వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఫీజుల చెల్లింపుల విషయంలో విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి తేవొద్దని గత నెలలోనే ఏఐసీటీఈ కాలేజీలను ఆదేశించింది. ఉద్యోగులను సైతం విధుల్లో నుంచి తొలగించొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు అందిన ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన ఏఐసీటీఈ సంస్థలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో కరోనా వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా మార్చి 16న అన్ని విద్యాసంస్థల్ని మూసివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత మార్చి 24న దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను పలు దశల్లో మే 17 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.

Related News

SSC పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

SSC పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూ జూలై
వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలు.. జూన్‌ 3న

వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలు.. జూన్‌ 3న

లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలను జూన్‌ 3న నిర్వహించాలని తెలంగాణ ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. జూన్‌ 3న ఇంటర్‌ రెండో సంవత్సర జాగ్రఫీ, మోడరన్‌ లాంగ్వేజీ పరీక్షలు జరుగుతాయని చెప్పింది. పాత హాల్‌ టికెట్లతో గతంలో
ఎంసెట్‌ జూలై లేదా ఆగస్టులో 

ఎంసెట్‌ జూలై లేదా ఆగస్టులో 

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఎంసెట్‌ను జూలై రెండోవారం లేదా ఆగస్టు మొదటివారంలో నిర్వహించేందుకు ఉన్నతవిద్యామండలి సన్నాహాలు చేస్తున్నది. జాతీయస్థాయిలో జూలై 18
టెన్త్  పరీక్షలపై రూమర్స్ నమ్మొద్దు: సబితా ఇంద్రారెడ్డి

టెన్త్ పరీక్షలపై రూమర్స్ నమ్మొద్దు: సబితా ఇంద్రారెడ్డి

తాజాగా సోషల్ మీడియాలో ఈ నెల 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది అని ఉదయం 8:00 నుండి 12:00 వరకు మొదటి పరీక్ష
పాత హల్ టికెట్లతోనే పది పరీక్షలు

పాత హల్ టికెట్లతోనే పది పరీక్షలు

కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో జరగాల్సిన పదోతరగతి పరీక్షలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో జరగాల్సిన పదోతరగతి పరీక్షలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.
జూన్ లో ఇంటర్ ఫలితాలు : సబితా ఇంద్రారెడ్డి 

జూన్ లో ఇంటర్ ఫలితాలు : సబితా ఇంద్రారెడ్డి 

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ఫలితాలను జూన్‌ రెండో వారంలో ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జవాబు పత్రాల కోడింగ్‌ గురువారం మొదలైందని, ఈ నెల 12వ తేదీ నుంచి మూల్యాంకనం