• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

అభినందన్ వర్ధమాన్ మళ్లీ విధుల్లో చేరారు

పంజాబ్: భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మళ్లీ విధుల్లో చేరారు. ఈ సందర్భంగా పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ నుంచి ఎయిర్‌చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవాతో కలిసి మిగ్-21 యుద్ధ విమానాన్ని అభినందన్ నడిపారు. 2019 ఫిబ్రవరి 27న బాలాకోట్ వైమానిక దాడి తర్వాత మళ్లీ యుద్ధ విమానాన్ని అభినందన్ నడిపించడం ఇదే తొలిసారి. ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగిన బాలాకోట్ వైమానిక దాడిలో అభినంద‌న్ మిగ్‌ను న‌డిపారు. పాక్ ఎఫ్-16 యుద్ధ విమానాలను తరుముతూ వెళుతున్న క్రమంలో అతడు ప్రయాణిస్తున్న మిగ్-21 బైసన్ విమానం దారితప్పింది. పాక్‌కు చెందిన ఎఫ్‌-16విమానాన్ని అభి నేల‌కూల్చాడు. ఫైట‌ర్ విమానాలు జ‌రిపిన డాగ్‌ఫైయిట్‌లో.. ఫిబ్ర‌వ‌రి 27వ తేదీన అభినంద‌న్‌కు చెందిన మిగ్-21 పాక్‌లో కూలిపోయింది. ఆ ప్రమాదంలోంచి  ప్రాణాలతో భయటపడ్డ అభినందన్ ను పాక్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. చర్చల అనంతరం అభిని మార్చి 1వ తేదీన  పాక్ రిలీజ్ చేసింది. ఆ తర్వాత సెలవుల్లో ఉన్న అభినందన్ తిరిగి ఇటీవ‌ల విధుల్లో చేరారు. 

Related News