• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

SSC పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతి: పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూ జూలై 10వ తేదీ నుంచి 15 వరకూ పరీక్షలు నిర్వహించనుంది. ప్రతి పేపర్‌కు 100 ​మార్కులు ఉంటాయి.  తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు సంబంధించి ఒక్కో పేపర్ మాత్రమే ఉంటుంది. విద్యార్థుల ఆరోగ్య రక్షణకు అన్నివిధాలా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నట్లు వెల్లడించింది. పరీక్షల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.  కాగా, లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 31 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా పడిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసింది.

 

ఏపీలో జులై నుంచి పదో తరగతి పరీక్షలు

జులై 10 నుంచి 15 వరకు పరీక్షలు

ప్రతీ పేపర్ కు 100 మార్కులు
 
కరోనా నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లకు కుదింపు

భౌతికదూరం పాటిస్తూ పరీక్షల నిర్వహణ

పరీక్షా సమయం :ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు

10-07.2020 (శుక్రవారం) -  ఫస్ట్ లాంగ్వేజ్

11-07.2020 (శని వారం)-  సెకండ్ లాంగ్వేజ్ 

12-07.2020 (ఆదివారం)-  థర్డ్ లాంగ్వేజ్

13-07.2020(సోమవారం) -  గణితం

14-07.2020(మంగళవారం) -   జనరల్ సైన్స్

15-07.2020(బుధవారం) -  సోషల్ స్టడీస్

16.07.2020(గురువారం) - OSSC మెయిన్ లాంగ్వేజ్

17.07.2020(శుక్రవారం) - SSC వొకేషనల్ కోర్సు


 

Related News

వారికి సకాలంలో వేతనాలు చెల్లించాల్సిందే..!

వారికి సకాలంలో వేతనాలు చెల్లించాల్సిందే..!

కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ సమయంలోనూ బోధన, బోధనేతర సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించాలని అన్ని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలు, సాంకేతిక సంస్థల్ని ‘అఖిల భారత సాంకేతిక విద్యా మండలి’(ఏఐసీటీఈ)
వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలు.. జూన్‌ 3న

వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలు.. జూన్‌ 3న

లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలను జూన్‌ 3న నిర్వహించాలని తెలంగాణ ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. జూన్‌ 3న ఇంటర్‌ రెండో సంవత్సర జాగ్రఫీ, మోడరన్‌ లాంగ్వేజీ పరీక్షలు జరుగుతాయని చెప్పింది. పాత హాల్‌ టికెట్లతో గతంలో
ఎంసెట్‌ జూలై లేదా ఆగస్టులో 

ఎంసెట్‌ జూలై లేదా ఆగస్టులో 

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఎంసెట్‌ను జూలై రెండోవారం లేదా ఆగస్టు మొదటివారంలో నిర్వహించేందుకు ఉన్నతవిద్యామండలి సన్నాహాలు చేస్తున్నది. జాతీయస్థాయిలో జూలై 18
టెన్త్  పరీక్షలపై రూమర్స్ నమ్మొద్దు: సబితా ఇంద్రారెడ్డి

టెన్త్ పరీక్షలపై రూమర్స్ నమ్మొద్దు: సబితా ఇంద్రారెడ్డి

తాజాగా సోషల్ మీడియాలో ఈ నెల 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది అని ఉదయం 8:00 నుండి 12:00 వరకు మొదటి పరీక్ష
పాత హల్ టికెట్లతోనే పది పరీక్షలు

పాత హల్ టికెట్లతోనే పది పరీక్షలు

కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో జరగాల్సిన పదోతరగతి పరీక్షలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో జరగాల్సిన పదోతరగతి పరీక్షలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.
జూన్ లో ఇంటర్ ఫలితాలు : సబితా ఇంద్రారెడ్డి 

జూన్ లో ఇంటర్ ఫలితాలు : సబితా ఇంద్రారెడ్డి 

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ఫలితాలను జూన్‌ రెండో వారంలో ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జవాబు పత్రాల కోడింగ్‌ గురువారం మొదలైందని, ఈ నెల 12వ తేదీ నుంచి మూల్యాంకనం