• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

ఉదయం కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: ఉగ్రవాదులకు నిలయంగా మారిన జమ్ముకశ్మీర్‌లో టెర్రరిస్టుల ఏరివేత కొనసాగుతున్నది. కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా ఖుల్‌చోహార్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతాదళాలు, పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. అయితే పోలీసులు, భద్రతా బలగాలపై టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతాదళాలు ఎదురు కాల్పులు జరపడంతో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారని పోలీసులు తెలిపారు. వీరు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారో తెలియరాలేదని, గాలింపు కోనసాగుతున్నదని వెల్లడించారు. జూన్‌ 26న పుల్వామా జిల్లాలోని చెవా ఉలార్‌ సమీపంలోని త్రాల్‌ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుపెటాయి. జమ్ముకశ్మీర్‌లో వారం రోజుల వ్యవధిలో సుమారు 12 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 

Related News

అమరజవాను సంతోష్ బాబుకు వీడ్కోలు

అమరజవాను సంతోష్ బాబుకు వీడ్కోలు

దేశంకోసం ప్రాణత్యాగం చేసిన సంతోష్ బాబు అమర్ రహే అనే నినాదాలతో సూర్యాపేట హోరెత్తిపోయింది. నగరవీధుల మీదుగా కేసారం వరకు 2 గంటలపాటు ఆయన అంతిమయాత్ర జరిగింది. ప్రజలు, కుటుంబసభ్యులు, బంధువులు, మంత్రులు, నేతలు,
కల్నల్ సంతోష్ బాబు‌ అంతిమయాత్ర

కల్నల్ సంతోష్ బాబు‌ అంతిమయాత్ర

సూర్యాపేట విద్యానగర్‌లోని ఆయన స్వగృహం నుంచి కల్నల్ సంతోష్‌బాబు అంతిమయాత్ర ప్రారంభమైంది. ఎంజీ రోడ్డు, శంకర్‌ విలాస్‌ సెంటర్‌, రైతు బజార్‌, పాత బస్టాండ్‌, కోర్టు చౌరస్తా, ఎస్పీ కార్యాలయం మీదుగా కేసారంలోని వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. దారి పొడవునా వేలాది మంది ప్రజలు భవనాలపై నుంచి పూలు చల్లుతూ
సంతోష్‌ పార్థివదేహం సూర్యాపేటకు తరలింపు

సంతోష్‌ పార్థివదేహం సూర్యాపేటకు తరలింపు

భారత్‌ సరిహద్దుల్లో చైనా దురాగతానికి అమరుడైన కర్నల్‌ సంతోష్‌బాబు పార్థివదేహం హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంది. ఆ వీర జవాను పార్థివ దేహానికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసైతో మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, మల్లారెడ్డి, ఎంపీ రేవంత్‌ రెడ్డి, డీజీపీ మహేందర్‌ రెడ్డి తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు.
ప్రత్యేక విమానంలో కల్నల్ సంతోష్ పార్థీవదేహం

ప్రత్యేక విమానంలో కల్నల్ సంతోష్ పార్థీవదేహం

భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్‌ సంతోష్‌ పార్థీవ దేహాన్ని ఆర్మీ ప్రత్యేక విమానంలో హకీంపేట్ ఎయిర్ పోర్టుకు తరలించింది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సూర్యటకు తరలించనున్నారు. బుధవారం ఉదయం 9 గంటల లోపు సంతోష్
భారత్‌-చైనా ఘర్షణలో తెలంగాణ కల్నల్ మృతి

భారత్‌-చైనా ఘర్షణలో తెలంగాణ కల్నల్ మృతి

భారత్‌-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన ముగ్గురు సైనికుల్లో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన వ్యక్తి ఉన్నారు. సరిహద్దులో చనిపోయిన కల్నల్‌ సంతోష్‌ సూర్యాపేట వాసి. ఈ ఘటన అనంతరం ఆయన మృతిపై అధికారులు కుటుంబ
జమ్మూకశ్మీర్‌ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌ కుల్గాం జిల్లాలోని వాన్‌పోరాలో భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వాన్‌పోరా వద్ద నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా ముష్కరులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
సరిహద్దుల్లో ముగ్గురు పాకిస్తాన్‌ సైనికులు హతం

సరిహద్దుల్లో ముగ్గురు పాకిస్తాన్‌ సైనికులు హతం

భారత్, పాక్ సరిహద్దుల్లో పాకిస్తాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇంకా ఉల్లంఘిస్తూనే ఉంది. జమ్మూకశ్మీర్‌లోని ఫూంచ్‌ జిల్లాలో భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా